Caroline Levitty: బైడెన్ చర్యలు ప్రతీకార చర్య:ట్రంప్ కార్యదర్శి కరోలైన్ లెవిట్టీ 1 d ago
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఇబ్బందుల పాలు చేయడానికి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ట్రంప్ గ్యాస్, చమురు డ్రిల్లింగ్ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లడానికి అవరోధం కల్పించేందుకు బైడెన్ 75 సంవత్సరాల పాత చట్టాన్ని అధికారంలోకి తెచ్చారు.
ఈ చట్టం ప్రకారం 1953 లో అమలులోకి వచ్చిన ఔటర్ కాంటినెంటల్ షెల్ఫ్ ల్యాండ్ యాక్ట్ ద్వారా, అమెరికా సముద్ర జలాల్లో దాదాపు 62 ఎకరాల ప్రదేశాన్ని చమురు, గ్యాస్ డ్రిల్లింగ్ నుండి కాపాడేందుకు అవకాశం ఉంది. ఈ చట్టం కింద అధ్యక్షుడికి ఔటర్ కాంటినెంటల్ షెల్ఫ్ ప్రాంతాన్ని చమురు, గ్యాస్ డ్రిల్లింగ్ నుండి మినహాయించే అధికారం ఉంది, దీనిలో తూర్పు, పశ్చిమ తీరాలు గల్ఫ్ ప్రాంతాలు ఉన్నాయి.
బైడెన్ మాట్లాడుతూ "చమురు, సహజవాయు డ్రిల్లింగ్ చేయడానికి అనువైన ప్రదేశాలను ఎంపిక చేసుకుంటే, స్వయంచాలకంగా మనకు కోలుకోలేని నష్టం జరుగుతుంది. అమెరికా ఇంధన అవసరాలను తీర్చేందుకు ఇలాంటి చర్యలు అవసరం కాదని" అభిప్రాయపడ్డారు. తామంతా క్లీన్ ఎనర్జీ ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు వేస్తున్నామని, తీరాలను రక్షించడానికి రాజకీయ అనుసంధానం అవసరమని ఆయన పిలుపునిచ్చారు. ట్రంప్ కార్యదర్శి కరోలైన్ లెవిట్టీ మాట్లాడుతూ బైడెన్ చర్యలను అమెరికా ప్రజలపై ప్రతీకార చర్యగా పేర్కొన్నారు. చమురు వెలికితీతలో బైడెన్ విఫలమయ్యారని తెలిపారు.